భారతదేశ యాదవ జాతికి తెలంగాణ దిక్సూచి కావాలి

తెలంగాణ ‘ఈనాడు’ : కోకాపేటలో యాదవ, కుర్మ భవనాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ భవనాలకు పది ఎకరాల స్థలం కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ…

‘భారతదేశ యాదవ, కురుమ జాతికి తెలంగాణ దిక్సూచి కావాలి. రాష్ట్రంలో పంపిణీ చేసిన గొర్రెలు, వాటి పిల్లలు కలిపి 48లక్షలు ఉన్నాయి.

రూ.వేల కోట్ల సంపదను యాదవులు సృష్టించబోతున్నారు. మూడు, నాలుగేళ్లలో అత్యంత ధనికులైన గొల్ల, కురుమలు తెలంగాణలో ఉంటారు.

పశువులు, గొర్రెల కోసం వంద మొబైల్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. గొల్ల, కురుమలలో అనాథలకు ఇక్కడ అన్నం, విద్య దొరకాలి. ఇక్కడి కల్యాణ మండపంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదల పెళ్లిళ్లు జరగాలి.

సంకల్పం, శక్తి ఉంటే.. గొల్ల కురుమ నిధి ఏర్పాటవుతుంది. నిధి కోసం బీసీ సంక్షేమశాఖ నుంచి రూ.కోటి మంజూరు చేస్తున్నాం. మూల నిధికోసం ధనవంతులైన గొల్ల, కురుమలు చందాలు ఇవ్వాలి.

రాష్ట్రంలో గొల్ల, కురుమల జనాభా 30లక్షలు ఉంది. ముదిరాజ్‌, గంగపుత్రుల జనాభా 40లక్షలు ఉంది. కంప్యూటర్లను మించిన మానవ వనరులు గొల్ల, కురుమలే’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Source:Eenadu

తెలంగాణ 'ఈనాడు' : కోకాపేటలో యాదవ, కుర్మ భవనాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ భవనాలకు పది ఎకరాల స్థలం కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ... ‘భారతదేశ యాదవ, కురుమ జాతికి తెలంగాణ దిక్సూచి కావాలి. రాష్ట్రంలో పంపిణీ చేసిన గొర్రెలు, వాటి పిల్లలు కలిపి 48లక్షలు ఉన్నాయి. రూ.వేల కోట్ల సంపదను యాదవులు సృష్టించబోతున్నారు. మూడు, నాలుగేళ్లలో అత్యంత ధనికులైన గొల్ల, కురుమలు తెలంగాణలో ఉంటారు. పశువులు, గొర్రెల కోసం వంద మొబైల్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం. గొల్ల, కురుమలలో అనాథలకు ఇక్కడ అన్నం, విద్య దొరకాలి. ఇక్కడి కల్యాణ మండపంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదల పెళ్లిళ్లు జరగాలి. సంకల్పం, శక్తి ఉంటే.. గొల్ల కురుమ నిధి ఏర్పాటవుతుంది. నిధి కోసం బీసీ సంక్షేమశాఖ నుంచి రూ.కోటి మంజూరు చేస్తున్నాం. మూల నిధికోసం ధనవంతులైన గొల్ల, కురుమలు చందాలు ఇవ్వాలి.…

0%

User Rating: 2.98 ( 6 votes)

Leave a Reply