యుద్ధం శరణం గచ్ఛమి

‘‘అనివార్యమైతే తప్ప యుద్ధం అవాంఛనీయం అని చెబితే ఇప్పుడు ఎవరన్నా ఇష్టపడతారో లేదో’’

యుద్ధం అంటే తల్లిదండ్రులు పిల్లలకు తలకొరివి పెట్టవలసి వచ్చే పాడు కాలం.

బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌ అన్నట్టు,

మంచి యుద్ధమూ ఉండదు, చెడ్డ శాంతీ ఉండదు.

యుద్ధమంటే తెలిసిన యూరోపును, చైనాను, మధ్య ఆసియాను, ఆఫ్రికాఖండాన్ని అడిగి చూడండి. అణుదాడి రుచితెలిసిన జపాన్‌ను అడగండి.

పశ్చిమ, తూర్పు సరిహద్దులుతప్ప, భారతీయ భూభాగానికి అసలైన యుద్ధం అంటే ఏమిటో తెలియదు. ఇప్పటి పిల్లలకైతే పబ్‌జీ గేమ్‌లు మాత్రమే తెలుసు.

తెలిసీ తెలియని ఉత్సాహంలో యుద్ధాన్ని ఎగదోస్తున్న మిత్రులారా, యుద్ధంలో సమిధలయ్యేది ఎవరో తెలుసా?

వీరజవాన్‌లకు మీరిచ్చే పెదవిచివరి వందనాలు పరిహారం అవుతాయా?

యుద్ధం వద్దని, శాంతి ముద్దని అందరి కంటె ముందు తెలిసినది వీరసైనికుడికే.

ఎందుకంటే, అతనికి మాత్రమే యుద్ధం పర్యవసానాలు తెలుసు.

(ఆంధ్రజ్యోతి సంపాదకీయం నుండి)

Leave a Reply