రణస్థలం కాకుండా రంగస్థలం ను అడ్డుకోవాలి

తిరుపతి 23 మార్చి 2018

రణస్థలం కాకుండా రంగస్థలం ను అడ్డుకోవాలని అఖిల భారత యువ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ. వై.ఎస్. యాదవ్ పిలుపునిచ్చారు.

రంగస్థలం చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మరియు ఓ పాట చరణంలోని కొన్ని పదాలను వాడిన పద్ధతిని అఖిల భారత యాదవ మహాసభ మరియు అఖిల భారత యువ యాదవ మహాసభ తరపున కండిస్తున్నామని, ఈ చిత్రంలోని ఓ పాటలో ‘గొల్లభామ’ అనే పదము పై యాదవ మహాసభ తెలిపిన ఆందోళనకి తలవొగ్గి ఆ పదము స్థానంలో ‘గోరువంక’ అనే పదాన్ని చేరుస్తామని తెలిపిన దర్శకుడు సుకుమార్ ఇప్పటివరకు ఆ పని చేయకపోవడాన్ని యాదవ మహాసభ తీవ్రంగా పరిగణిస్తున్నామని, అదేవిధంగా ఈ చిత్రంయొక్క టీజరులో వాడిన మరికొన్ని డైలాగ్స్

‘ గొల్ల నర్సమ్మ సొసైటీ వద్ద తీసుకొన్న అప్పుకు గాను’ ,

‘ గడ్డి తినే జాతికి కూడా గొంతు పెగులుతుంది’

వంటి మాటలపై కొన్ని అభ్యంతరాలు ఉన్నందున ఈ చిత్రం విడుదల తర్వాత థియేటర్ల వద్ద మరియు కొన్ని కులముల మధ్య గొడవలు జరుగుటకు దారితీసే పరిస్థితులు ఉన్నందున ఈ చిత్ర బృందం వెంటనే స్పందించి అఖిల భారత యాదవ మహాసభ నాయకులకు వెంటనే చిత్రంయెక్క ప్రత్యక షో ను ఏర్పాటు చేసి సంఘము వారు తెలిపే అబ్యంతరాలను పరిగణలోనికి తీసుకొని చిత్రంలో దానికి సరియగు దిద్దుబాట్లు చేసుకొని చిత్రమును విడుదల చేసుకొంటే చిత్ర బృందానికి, చిత్రం ప్రదర్శించే థియేటర్లకు కూడా మంచిదని, తమ ఆందోళన కేవలం చిత్రం విడుదల తరువాత జరుగు పరిణామాలను అడ్డుకొని సమాజంలో ఎటువంటి వైషమ్యాలకు తావులేకుండా చేయడానికే అని తెలిపారు.

ఆలాగే మదరాసు ప్రభుత్వము 19 డిసెంబర్ 1930 న జి. ఓ. నెంబర్ 5240 ద్వారా గొల్లలను యాదవ్ గా పిలవాలని అలాగే గొల్ల అని ఉన్న స్థానంలో యాదవ్ అని చేర్చాలని చట్టం చేయబడినదని తెలుపారు.
ఈ చిత్రానికి సంబంధించి ఓ TV చానల్లో జరిగిన ఓ చర్చలో గొల్లభామ అంటే అది కేవలం ఒక కీటకం అని, గొల్లభామ అనే పదాన్ని మనుషులకు వాడరని, ఇది వారి ఆత్మన్యూనతాభావానికి నిదర్శనమని తెలిపిన కత్తి మహేష్ వంటి ప్రభుద్ధుల అవగాహనారాహిత్యం ఏమాత్రం క్షమించరానిదని వారితో మరియు చిత్ర బృందంతో లాలూచీ పడినట్లు కనిపిస్తున్న ఆ టివి వారు కూడా ఆ రోజు చేసిన వ్యాఖ్యలు కూడా ఆమోదయోగ్యం కాదని తెలియచేేేసారు.

తిరుపతి స్థలపురాణం ‘ శ్రీ వెంకటాచలమహత్యం’ లో సాక్ష్యత్తు శ్రీమహాలక్ష్మి ‘గొల్లభామ’గా మారి ఆకాశరాజుకు ఆవును విక్రయించినది తిరుపతి చరిత్ర అని, గొల్లరావమ్మా అనే ‘గొల్లభామ’ తిరుమల ఆలయనిర్మాణ సమయములో అక్కడి కార్మికులకు మరియు భక్తులకు మజ్జిగ అమ్మి ఆ వచ్చిన మొత్తం డబ్భుతో ఆలయ మహాద్వారానికి ఎదురుగా శ్రీవారి ఆలయమునకు ఎటువంటి దృష్టిదోషం తగలకుండా కాపాడుతున్న గొల్లమండపం గా పిలువబడే ‘గొల్లభామ’ మండపం నేటికీ మనకళ్ల ముందు ఠీవిగా నిలబడిఉన్ననదని, అలాగే 12మంది ఆళ్వారులలో ప్రముఖంగా పిలువబడే గోదాదేవి శ్రీ కృష్ణుని తన నాథునిగా తలచి తానే ఓ ‘గొల్లభామ’గా మరి తిరుప్పావై అనే ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఆ దేవదేవుని సాన్నిధ్యం పొందినందున నేటికి ప్రతి సంవత్సరం సుప్రభాతం బదులుగా తిరుప్పావై ను ధనుర్మాసంలో తిరుమల ఆలయముతో పాటు ప్రతి వైష్ణవ ఆలయములో పారాయణం చేయడం ఆనవాయితీ అని, భారతీయ తర్కశాస్త్రానికి ఆద్యముగా పిలువబడే ఆత్మజ్ఞానం అనే ‘గొల్లభమా’కలపం ఒక బ్రహ్మణునికి ఓ మజ్జిగ అమ్మే ‘గొల్లభామ’కు మధ్య జరిగే సంవాదం ఓ అద్భుతంగా ఉన్నదని, ఇటునటి ‘గొల్లభామ’ల ఆనవాళ్లు భారతదేశం నలుమూలలా ప్రతి భారతీయ పురాణ ఇతిహాసములలో కోకొల్లలని, పై విషయాలపట్ల ఏ మాత్రం అవగాహన లేకుండా మీడియాలలో కేవలం మైలేజీల కోసం పాకులాడే కొందరి వ్యక్తుల చర్యలను మరియు టీ. ఆర్.పీ లకోసం విషయమును పక్కదారి పట్టిస్తు ఆసేతు హిమాచలం భారతదేశం నలుదిక్కుల విస్తరించి ఉన్న యాదవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ప్రసారాలను అఖిల భారత యాదవ మహాసభ తీవ్రంగా ఖండిస్తూ సమాజం ఏర్పాటు చేసుకున్న సహజ న్యాయాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం అని, కావున చిత్ర నిర్మాత, దర్శక నటీనటులు చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి అఖిల భారత యాదవ మహాసభ తెలుపుతున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొనిన ఎడల మేము కూడా చిత్ర విజయమునకు సహకరిస్తామని తెలియచేశారు.

ఈ విలేకరుల సమావేశంలో అఖిల భారత యువ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యకులు శ్రీ. వై.ఎస్. యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ ఈతమకుల హేమంత్ కుమార్ యాదవ్ ,అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాద్యక్యులు శ్రీ.వి. రామచంద్రయ్య యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ. ఉల్లిపాయల ముని మేఘనాధం యాదవ్, తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ. కట్ట జయరాం యాదవ్, చిత్తూరు జిల్లా యువజన అధ్యక్యులు శ్రీ. తులసి యాదవ్, తిరుపతి అర్బన్ యువజన అధ్యక్యులు శ్రీ. అనిల్ యాదవ్, కార్యవర్గ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply