Lakshmi Narasimha Yadav joins Congress Party

తేదీ 20 – 2 – 2019 న కర్నూలులో నేషనల్ కాంగ్రెస్ పార్టీ లో చేరనున్న విద్యార్థి యువజన జాతీయ అధ్యక్షుడు జె. లక్ష్మీ నరసింహ యాదవ్.
ఋదవారం ఉదయం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయం ముందు లక్ష్మీనరసింహ గారి నాయకత్వంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీగా బయలుదేరి లక్ష్మీ నరసింహ గారి తో పాటు జిల్లా నలుమూలల నుండి విద్యార్థి యువజన సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది

Narasimha

జె. లక్ష్మీ నరసింహ యాదవ్ గారి బయోడేటా:
పేరు : J.లక్ష్మీ నరసింహ యాదవ్
కులము : ఇండియన్ హిందూ, బిసి – డి
కార్యాలయం: 49/1/a/252,maddhur nagar
మొబైల్ : 9966190097
డేట్ అఫ్ బర్త్ : 7/10/1985
క్వాలిఫికేషన్ : MBA , (LLB)
ప్రజెంట్ పొజిషన్ : BC SC ST మైనార్టీ విద్యార్థి సమైక్య జాతీయ అధ్యక్షులు, బిసి యువసేన రాష్ట్ర అధ్యక్షులు, బీసీ జనసభ రాష్ట్ర కార్యదర్శి, బిసిJAC రాష్ట్ర కోఆర్డినేటర్, మరియు రాయలసీమ యూనిటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ. ఏపీ విద్యార్థియువజన జెఎసి రాష్ట్ర కో కన్వీనర్
ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ : ఎంబీఏ లో గోల్డ్ మెడల్ జే ఎన్ టి యు అనంతపురం,
NCC లో సి సర్టిఫికేట్, 2006 లో ఆర్మీ అటాచ్మెంట్ క్యాంపు మిలిటరీ హాస్పిటల్ గోల్కొండలో పాల్గొనడం జరిగింది.
పొలిటికల్ వర్క్: 2012 లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రఘువీరా రెడ్డి గారి నాయకత్వంలో అనంత భగీరథ యాత్ర( హంద్రీనీవా సుజల స్రవంతి) లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది, విభజన అనంతరం ఏపీ ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా దాదాపు రెండు లక్షల మంది ప్రజలతో సంతకాలు సేకరించి ఏపీ పిసిసి రాష్ట్ర అధ్యక్షులు గారికి అందజేయడం జరిగింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మరియు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేయడం జరిగింది, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆంధ్రదేశ్ కొచ్చినప్పుడు గుంటూరు సభ కానీ కర్నూలు గాని ఆ సభలు విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగింది,2014 నుండి 2019 వరకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతం చేయడానికి నా వంతుగా మా సంఘం తరుపున కృషి చేయడం జరిగింది.
పొలిటికల్ ఎక్స్పీరియన్స్: 2014 లో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వంలో సమైక్యాంధ్ర పార్టీ తరపున పాణ్యం అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది..
సోషల్ వర్క్ : విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అనేకచోట్ల బ్లడ్ క్యాంపులు, ఉచిత వైద్య క్యాంపులు, మరియు పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వడం జరిగింది.
సాధించిన విజయాలు : పేద విద్యార్థుల ఉచిత విద్య కోసం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాలని 2003 నుండి ఉద్యమం మొదలు పెట్టడం జరిగింది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు 2007 లో ఫీజు రీఎంబర్స్మెంట పథకాన్ని ప్రవేశపెట్టారు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక బిసి బాలుర మరియు బాలికల హాస్టల్స్ ఏర్పాటు చేయాలని ఎన్నో రూపాలలో పోరాటం చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 300 కళాశాల స్థాయి హాస్టల్లో ఏర్పాటు చేయడం జరిగింది. MBBS కౌన్సిలింగ్ విద్యార్థుల సంబంధించి go’ms :550 అమలు చేయాలని ఎన్నో రూపాల్లో పోరాటం చేసి చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి విజయం సాధించడం జరిగింది, కర్నూల్ లో IIT మరియు urdu యూనివర్సిటీ కోసం పోరాటం చేసి విజయ సాధించడం, హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆకలి కేక మరియు ఉద్యమ చైతన్యయాత్ర లాంటి కార్యక్రమాలు ఉద్యమాలు చేసి హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచుకోవడం జరిగింది, అదేవిధంగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అర్హులైన విద్యార్థులకు ఇవ్వకుండా కొన్ని కళాశాలలు యజమాన్యాలు అక్రమంగా దోచుకుంటుంటే ఎన్నో ఉద్యమాలు చేసి మళ్లీ తిరిగి విద్యార్థులకు ఇప్పించడం జరిగింది దాదాపు నందికొట్కూరు సాయిరాం పీజీ కళాశాల నుండి 30 laks, మరియు సుంకేసుల రోడ్డు లోని సైన్ జోసెఫ్ డిగ్రీ కళాశాల నుండి దాదాపు 60laks వరకు విద్యార్థులకు ఇప్పించడం జరిగింది, ఆధునిక భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3 న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ 2008 నుండి 2018 వరకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు రాయలసీమ వ్యాప్తంగా 2600 ఉపాధ్యాయులకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇదే క్రమంలో సావిత్రిబాయి పూలే జయంతి ని అధికారికంగా గుర్తించి ప్రభుత్వం చేతులమీదుగా అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2017 నుండి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా SC ST సబ్ ప్లాన్ కోసం మరియు జిల్లాకు ఒక బీసీ భవన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా బిసి సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని పోరాటం చేసి విజయం సాధించడం, ఇవే కాకుండా ఎన్నో విద్యార్థుల సమస్యలను ఎన్నో రూపాలలో అతీతంగా పోరాటం చేసి ఎంతో మంది విద్యార్థులకు చేయూత ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం చేస్తున్న ఉద్యమాలు : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మరియు వెనుకబడిన టువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక స్పెషల్ ప్యాకేజీ నిధులు కేటాయించాలని విభజన అనంతరం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తాం, అదేవిధంగా గుంతకల్ కడప ఉక్కు కర్మాగారం మరియు విభజన హామీలు అమలు కోసం, కేంద్ర స్థాయిలో బీసీల ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసం మరియు బీసీ జనాభా లెక్కల కోసం మరియు చట్టసభలలో బీసీలకు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడం, రైతు సంక్షేమం కోసం గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం కోసం మరియు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోసం కాల్ చేయడం, మరియు విద్య వ్యాపారీకరణ అడ్డుకట్ట వేయడం కోసం పోరాటాలు చేయడం

Leave a Reply