మొద్దు ( మతం )నిద్ర లో బీసీ యువత

మొద్దు ( మతం )నిద్ర లో బీసీ యువత:::

కేంద్రం ( మోడీ ప్రభుత్వం) నేడు తెచ్చిన 10% ఆగ్రకుల రిజర్వేషన్ లను నేడు ఎలా అర్థం చేసుకోవాలి?????

కేంద్ర ,రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ లకు రాజ్యాంగపరంగా పటిష్టమైన రిజర్వేషన్ లు ఉన్నాయి .వారికి వారి జనాభా మేర ప్రాతినిధ్యం వహించే రక్షణ ను వారు కలిగి ఉన్నారు ,వారికి ఆర్థిక కొలతలతో సంబంధం లేకుండా వారికి 15% & 7.5 % రిజర్వేషన్ లు వారు పొందుతున్నారు….

కానీ బీసీ రిజర్వేషన్ ల చరిత్ర వేరుగా ఉంది !!!!.

1947 కి ముందు బీసీ లకు మైసూరు, కర్ణాటక,మద్రాసు,బొంబాయి మొదలగు రాష్ట్రాల్లో బీసీ లకు రిజర్వేషన్ లు ఉండేవి కానీ స్వతంత్రం వచ్చి నూతన రాజ్యాంగం అమలు తర్వాత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లు అమలుపరిచి బీసీ రిజర్వేషన్ లు కావాలని అమలు చేయకుండా నాటి ప్రభుత్వాలు బీసీ లను అణచివేసి తమ అగ్రాకుల ఆధిపత్యం ను సుస్థిరం చేసుకున్నాయి …కానీ బీసీ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి తో 1953 లో నెహ్రూ ప్రభుత్వం కాకా సాహెబ్ కాలేల్కర్ కమిటీ (1+2) ను నియమించి బీసీ రిజర్వేషన్ కోసం సిఫారసు చేయమని చెప్పగా కమిటీ 2999 కులాలు చాలా వెనుకబడి ( కొన్ని దళిత ,గిరిజనుల కన్నా దీన స్థితిలో ఉన్నాయి ) అని వారు జనాభా లో 52% ఉన్నారు గనక వారికి జనాభా కి తగిన రిజర్వేషన్ ఇవ్వాలి అని కాలెల్కార్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనన్నారు అని తెలిసిన అగ్ర నాయకత్వం ఆ రిపోర్ట్ ను అమలు కాకుండానే కుట్రలు చేసి బీసీ ల అస్తిత్వాన్ని,హక్కులను దెబ్బ కొట్టాయి ,..
మళ్లీ 1978లో అనేక ఉద్యమాలు చేసిన అనంతరం అపుడు బీసీ ల సహకారం తో వచ్చిన జనతా ప్రభుత్వం వారి కోసం 1978 లో అప్పటికే బీహార్ లో బీసీ రిజర్వేషన్ లు అమలు పరిచిన బి. పి మoడల్ కమిటీ ను వేయగా ఆ కమిటీ
1.సామాజిక

  1. విద్యా
    3.ఆర్థిక వెనుకబాటు. ఆధారం చేసుకొని 1931 జనాభా లెక్కల ఆధారంగా వెనుక బడిన 3743 కులాలు ఉన్నాయి అని వారికి కనీసం 29%రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించగా 1980లో వచ్చిన ఇందిరా గాంధీ దాన్ని తొక్కిపెట్టి నాటి సిఫారసులను అణచివేసేందుకు నాటకీయ పరిస్థితులు సృష్టించింది.. 1991లో వి. పి సింగ్ నేతృత్వం లో బీసీ లకు న్యాయం చేస్తూ 29% రిజర్వేషన్ లు తీసుకురాగా వాటిని అగ్రవర్ణ / అగ్రకులాల వారు తీవ్రంగా వ్యతిరేకించి “మెరిట్” అనే అంశం తీసుకు అచ్చి ఇచ్చిన రిజర్వేషన్ లను కోర్టు లో సవాలు చేయగా ఇందిరా సహానే v / s India కేసు లో సుప్రీం కోర్టు వెనుకబడిన తరగతుల కు ఇచ్చిన రిజర్వేషన్ లు సమ్మతమే అని కానీ 50% మించి రిజర్వేషన్ లు ఇవ్వజాలరు అని 27% నికి పరిమితం చేస్తూ తీర్పు నిచ్చింది ….

కాని నేడు ఆ తీర్పు ను సవాలు చేస్తూ అగ్రవర్ణ / కులాల తోత్తులా నేటి ప్రభుత్వం నేడు ఆర్థికం గా వెనుక బడిన వారికి పేరున రిజర్వేషన్ లు తెచ్చింది కానీ ఇవి 50% సీలింగ్ ప్రాతిపదికన నిలబడ జాలవు ఒకవేళ సుప్రీం కోర్టులో ఒప్పుకున్నా బీసీలకు 52% జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వవలసి ఉంటుంది,,,…..

రిజర్వేషన్ లు సమర్తింపు గోబెల్స్ ప్రచారం::

అభినవ గోబెల్స్ ప్రచారక్ లు కొత్త నినాదం ఎత్తుకొని మోడీ ప్రభుత్వ కల్పించిన నూతన రిజర్వేషన్10% ఎస్సీ,ఎస్టీ, బీసీ లలోని అధిక ఆదాయ వర్గాలకు కూడా వర్తిస్తాయి అని కుహనా మేధావి వర్గం బాకా లు ఉదుతుంది కానీ నిజం మరోలా ఉంది అది;

  1. ఎస్సీ ఎస్టీ లకు రిజర్వేషన్ అనేది ఆర్థిక (8 లక్షల) పరిమితులకు లోబడి లేదు ,అసలు వారి రిజర్వేషన్ లకు ఆర్థిక ప్రతిపాదిత లేకుండా వారికి రాజ్యాంగ రక్షణ మేర రిజర్వేషన్ లు అమలు అవుతున్నాయి అపుడు వారికి 8 లక్షల ఆర్థిక ఆదాయ రిజర్వేషన్ అనేది పనికిరాదు….
  2. బీసీ లకు కూడా 8 లక్షల ఆదాయ పరిమితి తో కూడిన క్రిమిలేయర్ ఆధారిత రిజర్వేషన్ ఉన్నందున వారికి ఈ ఆర్థికం గా వెనుక బడిన రిజర్వేషన్ లు పనికి రావు..

ఈ ఆర్థికం గా వెనుక బడిన రిజర్వేషన్ లు అగ్రకులాల ఓటు బ్యాంక్ ను కాపుడోవడానికి వేసిన ఎత్తు మరియు బీసీ రిజర్వేషన్ లు తొలగించడానికి మొదటి మెట్టు..

బీసీ రిజర్వేషన్ లు తొలగింపు తొలి ప్రాధాన్యం::

ఎలాంటి రాజ్యాంగ పరిరక్షణ లేని కులం ఆధారిత బీసీ రిజర్వేషన్ లని ముందుగా వారికి దూరం చేయడానికి వేసిన తొలి అడుగే ఈ ఆర్థిక వెనుకబాటు రిజర్వేషన్ లు కల్పన ..,,బీసీ లకు రిజర్వేషన్ లు ఇవ్వడానికి ఇన్ని కమిటీ లు ,కమిషన్ లు ,సర్వే లు చేసిన ప్రభుత్వం !!!!? ఆర్థికం గా వెనుక బడిన ఓసి లకు ఏ ప్రాతిపాదికన.
( కమిటీ,కమిషన్,సర్వే) ఇచ్చింది అని తెలుసుకోవడం చాలా కష్టం ఎందుకంటే జనాభా లో 12 ,% ఉన్న ఓసి లలో 10% పేదలే కదా…

ఆర్థిక పరమైన రిజర్వేషన్ లు రాజ్యాంగపరమైన వెనా????

1995 లోనే అగ్ర కుల బ్రాహ్మణుడు అయిన పి.వి నరసింహారావు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 %రిజర్వేషన్ లు తీసుకురాగా వాటిని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది కావున ఆర్థిక పరమైన రిజర్వేషన్ లు చెల్లవు….

ఇప్పటికీ అయినా బీసీ యువత మెలుకొలేక పోతే మనకు కేంద్రం లో 27% , రాష్టం లో 29%ఉన్న రిజర్వేషన్ లు కోల్పోయి ఎటూ కానీ బికారిలు గా మిగిలి పోతూ దొరలు ఇచ్చిన బర్రెలు, గొఱ్ఱెలు కాసుకుంటు ,బ్రాహ్మణులు వేసిన మతం మత్తులో ,కోమట్ల దగ్గరా గుడి సామాను కొనుక్కుంటూ అదే సనాతన జీవితం గడుపుతూ ఉండవలసి వస్తుంది….

అసలు ఎసరు బీసీ లకే ….::.
బీసీ లలో ఇప్పటికే చాలా తక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల్లో , ప్రభుత్వ కాలేజీ లలో ప్రాతినిధ్యం ఉన్నారు ఒక వేళ ఈ రిజర్వేషన్ కూడా ఎత్తేస్తే ఇప్పటి బీసీ తరం ,మరియు వచ్చే తరాలు ఎప్పటికీ బానిస బతుకులు బతుకుతూ ,ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య అవకాశాలు పొందలేక చివరికి అత్యంత పేద స్థితికి దిగజారుతున్న వర్గం గా మిగిలి పోతారు

పొంచి ఉన్న ముప్పు.. బీసీలకే….

Courtesy: Dr. Ala Venkateswarlu

Leave a Reply