శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

చిక్కడు సిరి కౌగిటిలో

జిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం

జిక్కడు శ్రుతిలతికావలి

జిక్కె నతండు లీల దల్లిచేతన్ రోలన్.

న చాన్తర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరమ్
పూర్వాపరం బహిశ్చాన్తర్జగతో యో జగచ్చ యః

దేన్నైనా కట్టాలంటే అది నియమిత ప్రాంతములో ఉండాలి. ఫలాన చోట ఫలానా రూపములో ఉన్నదాన్ని పరిమాణం తెలిసినదాన్ని కట్టగలం.
మరి శ్రీ కృష్ణ పరమాత్మ?
లోపలా ఉంటాడు బయటా ఉంటాడు,
చూచే వారిలో ఉంటాడు,
ఎదురుగా ఉన్నదాన్ని చూచే కనులలో ఆయనే ఉంటాడు,
మనసులో ఆయనే ఉంటాడు,
వెలుపలా ఆయనే ఉంటాడు.
తూర్పూ పశ్చిమా అన్ని దిక్కులూ ఉంటాడు,
చిన్నవారికి చిన్నవాడు పెద్దవారికి పెద్దవాడు,
మొదటివారికి మొదటివాడు తరువాతి వారికి తరువాతి వాడు.
జగత్తుకు ముందూ ఉన్నాడు,
జగత్తు తరువాతా ఉన్నాడు,
జగత్తూ అయానే అయి ఉన్నాడు.
అలాంటి స్వామిని ఎలా కట్టేయాలి.

Leave a Reply